రానా బ‌ర్త్‌డే పార్టీలో చెర్రీ, అఖిల్‌, సానియా

బాహుబ‌లి సినిమాతో అశేష ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుడు ద‌గ్గుబాటి రానా నిన్న త‌న 34వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్నాడు. రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిజేశారు. జ‌పాన్‌లోను రానాకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా, అభిమానులు ఆర్కా మీడియా ఆఫీసుకి దాదాపు 19 బాక్సుల గిఫ్ట్‌లు, లేఖ‌లు కానుక‌గా పంపించారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. అయితే రానా నిన్న సాయంత్రం ఇంట్లో పుట్టిన రోజు వేడుక‌ని జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ వేడుక‌కి రామ్ చ‌ర‌ణ్‌, అఖిల్‌, సానియా మీర్జాతో పాటు ప‌లువురు స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. పార్టీకి సంబంధించిన ఫోటోల‌ని రానా త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. నా వైపు నుండి ఎల్ల‌ప్పుడు కొంద‌రిని మిస్ అవుతూనే ఉంటాను. కాని నా జీవితాన్ని సంతోష‌మ‌యంగా మార్చినందుకు ధ‌న్యవాదాలు అని కామెంట్ పెట్టారు. రానా ప్ర‌స్తుతం తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు .

255 total views, 1 views today