అవార్డుల వేడుకలో అలియాభట్ డ్యాన్స్..వీడియో

బాలీవుడ్ నటి అలియాభట్ తన డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేసింది. కిడ్స్ ఛాయిస్ అవార్డ్సు 2017 కార్యక్రమంలో అలియా తమ్మా తమ్మా పాటకు స్టెప్పులేసింది. మేక్‌స్విప్ట్ లెగ్స్, పిల్లల కాస్ట్యూమ్స్‌తో చేతులను కాళ్లలా మార్చి తమ్మా తమ్మా పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రణ్‌వీర్‌సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి అలియాభట్ ప్రదర్శనకు స్టన్ అయిపోయారు. స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, స్టేజి కిందున్న ప్రేక్షకులు అలియాభట్ ప్రదర్శనను కన్నార్పకుండా తిలకించారు. అలియా డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

104 total views, 1 views today