లోక్‌సభకు మాధురీదీక్షిత్.. పుణె నుంచి పోటీ!

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్(51) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూణె లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు బీజేపీ సిద్దమైంది. ఈ ఏడాది జూన్‌లో సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాధురీ దీక్షిత్‌ను ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ.. పూణే లోక్‌సభ స్థానానికి చేసిన షార్ట్‌లిస్ట్‌లో మాధురీ దీక్షిత్ పేరు ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో ఆమెను పోటీలోకి దించే విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందన్నారు. మాధురీ దీక్షిత్‌కు ఇదే మంచి అవకాశంగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

48 total views, 2 views today