ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన బిగ్ షాపింగ్ డేస్ సేల్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో ఇవాళ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 8వ తదీ వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పోకో ఎఫ్1, మోటో ఎక్స్4, మోటోరోలా వన్ పవర్, హానర్ 10, అసుస్ జెన్‌ఫోన్ 5జడ్, గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ తదితర ఫోన్లపై ఆకట్టుకునే రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రూ.5వేల తగ్గింపుతో రూ.39,999 ధరకు లభిస్తుండగా, నోకియా 8 సిరోకో రూ.36,999 ధరకు, ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ రూ.29,999 ధరకు, పోకో ఎఫ్1 రూ.25,999 ధరకు లభిస్తున్నాయి. అలాగే మోటోరోలా వన్ పవర్ ఫోన్ రూ.14,999 ధరకే లభిస్తున్నది. ఇవే కాకుండా టీవీలు, ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లపై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

41 total views, 1 views today