హైదరాబాద్‌ నుంచి స్పైస్‌జెట్‌ 8 కొత్త సర్వీసులు

గురుగ్రామ్‌: స్పైస్‌జెట్‌ జనవరి 1 నుంచి 8 కొత్త సర్వీసులను హైదరాబాద్‌ నుంచి నిర్వహించనుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి 33 ప్రాంతాలకు నేరుగా సర్వీసులను సంస్థ నిర్వహిస్తుండగా, కొత్త సర్వీసులతో కలిపి ఇవి 41కి చేరతాయి. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌ నగరాలకు నేరుగా వెళ్లి, వచ్చేలా కొత్త సర్వీసులు రూపొందించారు.
ప్రారంభ ఆఫర్లు: హైదరాబాద్‌-కోల్‌కతా మార్గం – రూ.2,699 నుంచి, కోల్‌కతా-హైదరాబాద్‌ మార్గం – రూ.3,199 నుంచి, హైదరాబాద్‌-పుణె .. – రూ.2,429 నుంచి, పుణె-హైదరాబాద్‌ .. రూ.2,209 నుంచి, హైదరాబాద్‌ – కోయంబత్తూర్‌.. రూ.2,809 నుంచి, కోయంబత్తూర్‌-హైదరాబాద్‌ .. – రూ.2,309 నుంచి టికెట్‌ ధరలు ప్రారంభ ఆఫర్‌గా ఇస్తామని తెలిపింది.

40 total views, 1 views today