Pujara @ 5000 రన్స్.. ద్రవిడ్‌‌తో అరుదైన పోలిక

అడిలైడ్ టెస్టులో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత శతకంతో ఆదుకున్న పుజారా.. ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆపద్భాందవుడి పాత్ర పోషించిన పుజారా టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

పుజారా ఆట చూస్తే.. మనకు రాహుల్ ద్రవిడ్ గుర్తొస్తాడు. అన్నట్టు ద్రవిడ్‌, పుజారా మధ్య ఆటలోనే కాదు మరో విషయంలోనూ పోలిక ఉంది. ద్రవిడ్ 108 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు పూర్తి చేయగా.. పుజారా కూడా 108 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతే కాదు.. వీరిద్దరూ 3 వేల పరుగులను 67 ఇన్నింగ్స్‌ల్లో, 4 వేల పరుగులను 84 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం యాదృచ్ఛికమే అయినా ఆశ్చర్యకరమైన అంశం.

ఆసియా వెలుపల జరిగిన టెస్టు మ్యాచ్ తొలి రోజు సెంచరీ సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మెన్ పుజారా కావడం గమనార్హం. 1952లో మంజ్రేకర్ ఈ ఘనత సాధించగా.. సచిన్ 2001లో ఈ జాబితాలో చేరాడు. సెహ్వాగ్, విజయ్ కూడా ఈ ఫీట్ సాధించగా.. కోహ్లి రెండుసార్లు తొలి రోజే శతకాలు బాదాడు.

13 total views, 1 views today