చింతమడకలో ఓటేయనున్న సీఎం కేసీఆర్

సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కును చింతమడక గ్రామంలో వినియోగించుకోనున్నారు. కేసీఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఇవాళ పరిశీలించారు. చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు.

35 total views, 1 views today