ప‌ది మందికి పైగా క‌థానాయిక‌ల‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. మొద‌టి పార్ట్ లో ఎన్టీఆర్ బాల్యం, విద్యా బ్యాసం గురించి ప్ర‌స్తావించ‌నుండ‌గా రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన విష‌యాలు చూపించ‌నున్నారు. అయితే రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్‌లో మొత్తం ప‌ది మందికి పైగా క‌థానాయిక‌లు క‌నిపించ‌నున్నారు.

ఎన్టీఆర్‌లో తార‌క రామారావు శ్రీమతి బసవతారకం పాత్ర‌లో విద్యాబాలన్ పోషిస్తుండ‌గా , సావిత్రి పాత్రలో నిత్యామీనన్, కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్,షావుకారి జానకి పాత్రలో షాలినీ పాండే, శ్రీదేవి పాత్రలో రకుల్, జయప్రద పాత్రలో హన్సిక ,జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్, ప్రభగా శ్రియ నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో ఆమని .. ఈషా రెబ్బా .. మంజిమామోహన్ .. పూనమ్ బజ్వా కనిపించనున్నారు. ఇంతమంది కథానాయికలతో తెర‌కెక్కిన తొలి బ‌యోపిక్‌గా ఎన్టీఆర్ ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకుంది.

58 total views, 1 views today