పవన్ కళ్యాణ్ ను తిప్పలు పెడుతున్న ఫోర్బ్స్ జాబితా!

నా దగ్గర డబ్బులు లేవు…
నా దగ్గర కార్ EMI కట్టడానికి కూడా డబ్బులు లేవు…
నేను కానిస్టేబుల్ కొడుకుని నా దగ్గర డబ్బులు లేవు…

“నా దగ్గర డబ్బులు లేవు…నా దగ్గర డబ్బులు లేవు…నా దగ్గర డబ్బులు లేవు…ఈ మాటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ తన ప్రసంగాలలో వాడుతుంటారు.జనాలని ఉద్దెశించి మాట్లాడుతూ మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు అని సింపతీ కూడకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అసలు మామూలు డబ్బులేని వ్యక్తి పార్టీ స్థాపించగలడా…స్థాపించి డబ్బు లేకుండా నడపగలడా? ఒక ప్రచారానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక సభ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? పార్టీ ఆఫీస్ నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకు తెచ్చుకోరా?

2018 ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా లో టాలీవుడ్ నటులలో మొదటి స్థానం లో నిలిచారు పవన్ కళ్యాణ్. అత్యధికంగా సంపాదిస్తున్న పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు ! ఇదేమి విచిత్రమో. మాట్లాడితే జగన్,చంద్రబాబు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అని అంటున్న పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పార్టీ అధినేతగా తన ఆస్తుల వివరాలు తెలుపగలరా?”

ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా చూసిన తరువాత నెటిజన్లు ఇలాంటి ఎన్నో ప్రశ్నలని జనసేన అధినేత ను ప్రశ్నిస్తున్నారు.

 

22 total views, 1 views today