ప్రియాంకనిక్ వెడ్డింగ్ కేక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ప్రియాంకనిక్ అదేనండి..ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతుల ముద్దు పేరు. ఇప్పుడు ఫేమస్ సెలబ్రిటీలను వాళ్ల ముద్దుపేర్లతో పిలవడమే ట్రెండ్ కదా. చైసామ్, విరుష్క, దీప్‌వీర్.. అలాగే ప్రియాంకనిక్ అన్నమాట. చాలామంది నిక్యాంక అని కూడా పిలుస్తున్నారు లేండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. నిక్యాంక పెళ్లి కోసం స్పెషల్‌గా కేక్‌ను డిజైన్ చేయించారట. ఆ కేక్‌కు చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. మొత్తం 18 ఫీట్ల పొడవు ఉండే ఈ కేక్‌ను నిక్ జోనాస్ పర్సనల్ చెఫ్స్ తయారు చేశారు. వాళ్లు నిక్ కోసమే దుబాయ్, కువైట్ నుంచి ఇండియా వచ్చారు. 18 ఫీట్ల పొడవే కాదు.. మొత్తం 6 లేయర్లతో దాని తయారు చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ కేక్‌ను నిక్యాంక తమ పెళ్లి వేడుకల్లో కట్ చేశారు. ఇక.. ఆ కేక్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

79 total views, 1 views today