ఐపీఎల్‌-2019 వేలం: 70 స్థానాలు.. 1003 మంది

దిల్లీ: వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐపీఎల్‌-2019లో 70 స్థానాల కోసం 1003 మంది ఆట‌గాళ్లు పోటీ ప‌డ‌నున్నారు. ఈ నెల 18న జైపుర్‌లో నిర్వహించనున్న ఐపీఎల్‌ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీల్లో ఉన్న 70 స్థానాల కోసం 1003 మంది క్రికెటర్లు పోటీ పడనున్నారు. ఇందులో 232 మంది విదేశీ క్రికెటర్లు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌, బిహార్‌ నుంచి కూడా ఆటగాళ్లు తొలిసారి వేలంలో పాల్గొనబోతున్నారు. ఎప్పుడూ ఆటగాళ్ల వేలం కార్యక్రమాన్ని నిర్వహించే రిచర్డ్‌ మాడ్లీ స్థానంలో ఈ సారి ఎడ్మాడ్స్‌ కనిపించనున్నాడు.

33 total views, 1 views today