పెళ్లిని దాచగలం కానీ గర్భాన్ని దాచగలమా?:అనుష్క‌

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ గ‌త ఏడాది భార‌త్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత వీరిరివురు చ‌ట్టాప‌ట్టాలు వేశారు. వాటికి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే కొద్ది రోజుల నుండి అనుష్క గ‌ర్భ‌వ‌తిగా ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆమె సినిమాలు ఒప్పుకోక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే అంటూ పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన అనుష్క శ‌ర్మ గాసిప్ రాయుళ్ళ‌కి గ‌ట్టిగా బుద్ది చెప్పింది. పెళ్ళిని దాచ‌గ‌లం కాని, గ‌ర్బాన్ని ఎలా దాచ‌గ‌లం . అర్దం ప‌ర్ధంలేని ఇలాంటి కామెంట్స్‌ని నేను అస్స‌లు ప‌ట్టించుకోను. చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్న‌వారు దాదాపు ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ని ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి పుకార్లు పెళ్లి కాకుండానే వివాహితను, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయని మండిపడింది. ప్ర‌స్తుతం తాను బిజీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాన‌ని చెప్పిన అనుష్క ఈ డిసెంబ‌ర్ 21న జీరో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మాన‌సికి రోగిగా అనుష్క కనిపించ‌నుంది.

55 total views, 1 views today