ఆసీస్‌తో తొలి టెస్టు: టీ స‌మ‌యానికి భార‌త్ 143/6

ఆడిలైడ్ : భార‌త్ -ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌల‌ర్స్ ప‌ట్టు బిగించారు. లంచ్‌కి ముందే నాలుగు వికెట్స్ తీసి ఇండియాని క‌ష్టాల‌లోకి నెట్టిన బౌల‌ర్స్ లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిష‌బ్ పంత్ (25; 2 ఫోర్స్‌, 1 సిక్స్) వికెట్స్ తీశారు. టీ స‌మయానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా (46 బ్యాటింగ్: 141బంతుల్లో 4×4), అశ్విన్ ( 5 బ్యాటింగ్; 19 బంతుల్లో) ఉన్నారు. ఈ రోజు ఉద‌యం ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు. ఆస్రేలియా బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు వికెట్స్ , లియాన్‌కి రెండు వికెట్స్ ద‌క్క‌గా, స్టార్క్‌, క‌మిన్స్ చెరో వికెట్ తీసారు.

41 total views, 1 views today