ఎయిర్‌పోర్ట్‌లో ప్రియాంక డ్యాన్స్‌..నిక్‌ నవ్వులు

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ వివాహం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. వారి పెళ్లి వేడుకలు జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో డిసెంబరు 1, 2 తేదీల్లో ఘనంగా జరిగాయి. మొదట వారు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోగా, తరవాతి రోజు హిందూ పద్ధతిలో ఒక్కటయ్యారు. డిసెంబరు 3న వారు జోధ్‌పూర్‌ నుంచి దిల్లీకి చేరుకున్నారు. ఆ సమయంలో విమానాశ్రయంలో చోటుచేసుకున్న చిన్న సంఘటన అభిమానులను అలరిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దానిలో ఎయిర్ పోర్ట్‌లో అభిమానులు కనిపించగానే ప్రియాంక చిన్న డ్యాన్స్‌ స్టెప్పులు వేసి నవ్వించారు. దాన్ని చూసి నిక్‌ చిరునవ్వులు చిందించారు.

వివాహ వేడుకల సమయంలో తాను చాలా ఉద్వేగానికి గురయ్యాయని నిక్‌జొనాస్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిక్ తండ్రి ఇన్‌స్టాగ్రాం సందేశం ద్వారా ప్రియాంకను తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ జంట మంగళవారం రాత్రి దిల్లీలో వివాహ విందు ఇచ్చారు. దానికి ప్రధాని మోదీ హాజరై, వారిని ఆశీర్వదించారు.

33 total views, 1 views today