అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి రాజిందర్ కు కోర్టు జైలుశిక్ష

అమెరికాలోని షికాగోలో రోడ్డు రవాణా సంస్థలో మేనేజర్‌గా పనిచేసే భారతీయ సంతతి వ్యక్తి రాజిందర్ సచ్‌దేవా (54)కు కోర్టు జైలుశిక్ష విధించింది. తన పదవిని ఉపయోగించుకుని అతడు మూడు లక్షల డాలర్ల దాకా లంచాలు మింగాడని రుజువైంది. తన పదవిని దుర్వినియోగపర్చి అతడు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చేశాడు. ఐటీ కాంట్రాక్టుల కింద ఆ లంచాలు రాబట్టుకుని ఆర్డర్లు వచ్చేలా చేశాడని ఆరోపణలు వచ్చాయి. 2010-2014 మధ్యకాలంలో ఈ ముడుపుల వసూలు జరిగింది. అభియోగాలు రుజువు కావడంతో కోర్టు అతడికి 1 సంవత్సరం 1 రోజు జైలుశిక్ష విధించింది.

71 total views, 1 views today