టాలీవుడ్ ఫోర్బ్స్ 2018 లిస్ట్

భారత్‌లో అత్యధికంగా సంపాదిస్తోన్న సెలబ్రిటీల జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ 100 జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన రూ. 253.25 కోట్లు. ఇక రూ.228.09 కోట్ల సంపాదనతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సౌత్ స్టార్స్ విషయానికి వస్తే..సూపర్ స్టార్ రజనీకాంత్ 14 స్థానంలో రూ.50 కోట్లు తో ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 24వ స్థానంలో ఉన్నారు.

పవన్ సంపాదన రూ.31.33 కోట్లు. టాలీవుడ్ నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్‌దే అత్యుత్తమ స్థానం. పవన్ తర్వాత జూ. ఎన్టీఆర్ 28 స్థానంలో ఉన్నాడు. మిగతా హీరోల విషయానికి వస్తే.

1. పవన్ కళ్యాణ్ (24వ స్థానం) – రూ.31.33 కోట్లు
2. జూనియర్ ఎన్టీఆర్ (28వ స్థానం) – రూ.28 కోట్లు
3. మహేష్‌బాబు (33వ స్థానం) – రూ.24.33 కోట్లు
4. నాగార్జున (36వ స్థానం) – రూ.22.25 కోట్లు
5. కొరటాల శివ (39వ స్థానం) – రూ.20 కోట్లు
6. అల్లు అర్జున్ (64వ స్థానం) – రూ.15.67 కోట్లు
7. రామ్ చరణ్ (72వ స్థానం) – రూ.14 కోట్లు
8. విజయ్ దేవరకొండ (72వ స్థానం) – రూ.14 కోట్లు.

57 total views, 1 views today