ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ – టాప్‌లో సల్మాన్.. టాప్-15లో రజనీ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ అనుభవిస్తున్న సల్మాన్.. అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇండియాలో అత్యధికంగా ఆర్జించే సెలబ్రెటీలకు సంబంధించి ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ విడుదల చేసింది. 

దీనిలో రూ.253.25 కోట్లతో సల్మాన్ అగ్రస్థానంలో నిలిచారు. 2017 అక్టోబరు 1 నుంచి 2018 సెప్టెంబరు 30 వరకు వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ రూ.50 కోట్లతో ఈ జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. 2015లో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన షారుక్ ఈ సారి టాప్-10లో చోటు కోల్పోయారు. గతేడాది జాబితాలో షారుక్ రూ.170.5కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితా ఇలా..
1. సల్మాన్ ఖాన్ – రూ.253.25కోట్లు 2. విరాట్ కోహ్లి – రూ. 228.09కోట్లు 
3. అక్షయ్ కుమార్ – రూ.185కోట్లు 
4. దీపికా పదుకొణె – 112.8కోట్లు 
5. మహేంద్రసింగ్ ధోనీ – 101.77
6. అమీర్ ఖాన్ – రూ.97.5 కోట్లు 
7. అమితాబ్ బచ్చన్ – రూ. 96.17కోట్లు 
8. రణ్‌వీర్ సింగ్ – రూ.84.67 కోట్లు 
9. సచిన్ టెండూల్కర్ – రూ.80 కోట్లు 
10. అజయ్ దేవ్‌గన్ – రూ. 74.5కోట్లు 

32 total views, 1 views today