గంభీర్ నువ్వు నాకు ప్రత్యేకం: షారుక్‌ఖాన్‌

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రతో గురువారం ఆరంభమయ్యే రంజీ మ్యాచే తన ఆఖరిదని 37 ఏళ్ల గంభీర్‌ వెల్లడించాడు. దూకుడైన ఓపెనర్‌గా పేరున్న ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌ 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా గంభీర్ టీమిండియాకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేక మంది క్రీడాకారులు ట్వీట్లు పెడుతున్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ గంభీర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ యజమానిగా షారుక్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన కోల్‌కతా పగ్గాలందుకున్న గంభీర్ ఆ జట్టు రాత మార్చేశాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా జట్టుపై తనదైన ముద్ర వేసి రెండుసార్లు విజేతగా నిలిపాడు. అందుకే గంభీర్ అంటే షారుక్‌కు ఎంతో అభిమానం.

గంభీర్ రిటైర్మెంట్‌పై షారుక్ స్పందిస్తూ.. ‘నా జట్టుకు కెప్టెన్‌గా చేసినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో నువ్వో ప్రత్యేకమైన వ్యక్తివి. అల్లా నీకు ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

1999-2000లో టీమిండియాలోకి వచ్చిన గంభీర్ 58 టెస్టులు ఆడి 41.95 యావరేజ్‌తో 4,154 పరుగులు సాధించాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5,238 పరుగులు సాధించాడు. గంభీర్ తన చివరి టెస్ట్ 2016లో ఇంగ్లండ్‌తో ఆడాడు. దూకుడైన ఓపెనర్‌గా పేరున్న ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌ 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

తన రిటైర్మెంట్‌పై గంభీర్ మంగళవారం భావోద్వేగంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు్ చేశారు. ‘రిటైర్మెంట్‌ ఆలోచన కొంతకాలంగా నన్ను వెంటాడుతోంది. చికాకు పరిచే అదనపు సరంజామాగా విమానాల్లోనూ నాతో ప్రయాణించింది. నాతోపాటు సాధనకూ వచ్చింది. నన్ను వెక్కిరిస్తూనే ఉంది’’ అంటూ తాను ఎలా రిటైర్మెంట్‌ నిర్ణయానికి వచ్చాడో చెప్పాడు.

33 total views, 2 views today