మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బెల్లీ డ్యాన్స్

మిల్కీబ్యూటీ తమన్నా అప్ కమింగ్ మూవీ నెక్స్ట్ ఏంటి ప్రీ రిలీజ్ వేడుకలో బెల్లీ డాన్స్‌తో స్టేజ్‌ను షేక్ చేసింది. తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, లిరిస్సా హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ మంచి అంచనాలతో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలో భాగంగా ప్రీ రిలీజ్‌కు యాంకర్‌గా ఉన్న శ్యామల ‘నెక్స్ట్ ఏంటి’ చిత్ర యూనిట్‌తో ‘ట్రూత్ ఆర్ డేర్’ అనే వెరైటీ గేమ్ ఆడించారు. ఈ గేమ్ ప్రకారం ట్రూత్ బాక్స్‌లో వచ్చిన చీటీ ప్రకారం అంతా నిజమే చెప్పాలి. ఇక డేర్ బాక్స్‌లో చీటీ తీసుకుంటే అందులే ఏం రాసి ఉంటే అలా చేయాలి. మొదట ఈ గేమ్ హీరో సందీప్ కిషన్ ట్రూత్‌ చీటీని తీసుకోగా.. ‘మీ ఫస్ట్ డేట్ ఎవరితో? ఎప్పుడు? అనే క్వచ్ఛన్ వచ్చింది. ‘వైజాగ్ తిమ్మాపురంలో విజ్ఞాన్ కాలేజ్‌లో చదువుకున్నప్పుడు ఫస్ట్ డేట్ చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక నెక్స్ట్ తమన్నా.. డేర్ క్వచ్ఛన్‌ని సెలెక్ట్ చేసుకోగా.. బెల్లీ డాన్స్ చేయాలని చీటీలో రాసి ఉండటంతో స్టేజ్ ఎక్కి నడుముని బొంగరంలా తీప్పేసింది. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంలోని స్వింగ్ జరా సాంగ్‌కి నవదీప్, సందీప్ కిషన్‌లతో కలిసి నడుమును స్వింగ్ చేస్తూ బెల్లీ డాన్స్‌తో రచ్చ చేసింది. హై హీల్స్ వేసుకోవడంతో కాస్త ఇబ్బంది పడినా ఆడియన్స్‌ని మాత్రం ఎంటర్‌టైన్ చేసింది. మొత్తానికి ఈ డేర్ అండ్ ట్రూత్ గేమ్ చాలా సరదాగా గడిచింది.

95 total views, 1 views today