75 అడుగుల రాల్ఫ్ వేల్ డ్రెస్‌లో మెరిసిన ప్రియాంక‌

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా జోథ్‌పూర్‌లోని ఉమైద్ భ‌వ‌న్ ప్యాలెస్‌లో అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహం జ‌ర‌గ‌గా, డిసెంబ‌ర్ 3న హిందూ సంప్ర‌దాయం ప్రకారం జ‌రిగింది. ఎంతో ఘ‌నంగా జ‌రిగిన వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోల‌ని ప్రియాంక త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వివాహంలో ప్రియాంక చోప్రా 75 అడుగుల రాల్ఫ్‌ వేల్‌ డ్రెస్‌ ధరించింది. అందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కి రాగా, ఇది అంద‌రిని ఆకర్షిస్తోంది. ప్రియాంక రాల్ఫ్ డ్రెస్‌తో వేదిక వద్ద‌కి చేరుకునేందుకు ఐదు మంది ఆమెకు సహాయం చేశారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ‍్యుల మధ్య జ‌రిగిన పెళ్లి వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. సంగీత్‌, మెహందీ వేడుక‌ల‌లో నిక్, ప్రియాంక‌లు త‌మ డ్యాన్స్‌ల‌తో దుమ్ము రేపార‌ట‌. క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో జ‌రిగిన వివాహంలో ప్రియాంక వైట్‌ డ్రెస్‌లో, నిక్‌ బ్లాక్‌ సూట్‌లో దర్శనమిచ్చాడు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహంలో రెడ్‌ డ్రెస్‌లో నవ వధువు ప్రియాంక మెరిసిపోయారు. త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖుల కోసం ఈ నూత‌న దంప‌తులు గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌.

69 total views, 1 views today