ప్రియాంక రిసెప్ష‌న్‌లో చిరున‌వ్వులు చిందించిన మోదీ

జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో లావింగ్ వెడ్డింగ్ జ‌రుపుకున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంప‌తులు మంగ‌ళ‌వారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు. స్టేజ్‌పై ప్రియాంక చోప్రాతో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించిన మోదీ చిరున‌వ్వులు చిందించారు. మోదీ రాక‌తో ప్రియాంక దంప‌తులు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. రిసెప్ష‌న్‌లో ప్రియాంక త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ని మోదీకి ప‌రిచ‌యం చేసింది. గ‌తంలో అనుష్క‌, కోహ్లీల రిసెప్ష‌న్‌కి కూడా మోదీ హాజ‌రై వారిని ఆశీర్వ‌దించిన సంగ‌తి తెలిసిందే.

రిసెప్ష‌న్‌లో ప్రియాంక లెహంగా ధ‌రించ‌గా, నిక్ బ్లూ క‌ల‌ర్ సూట్ ధరించాడు. ఇక ప్రియాంక‌, నిక్ కుటుంబ స‌భ్యులు ట్రెడిష‌నల్ దుస్తుల‌లో మెరిసారు. ఎంతో గ్రాండ్‌గా జ‌రిగిన రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. నిక్‌, ప్రియాంక‌ల వివాహం డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌గా, డిసెంబ‌ర్ 3న హిందూ ప‌ద్ద‌తిలో జ‌రిగింది. అంత‌క ముందు సంగీత్‌, మెహందీ వేడుక‌లు అంబ‌రాన్నంటేలా జరిగాయి.

49 total views, 1 views today