వైజాగ్ లో నేవీ నావికాదళ విన్యాసాలు

సాగతీరంలో నావికాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. బీచ్ అంతా జన సంద్రంగా మారిపోయింది. శత్రువులు వచ్చినప్పుడు నావికాదళం.. వారిపై ఏలా దాడి చేస్తారు. శత్రువుల స్థావరాల ధ్వంసం తర్వాత ఎలా తప్పించుకుంటారు వంటి విన్యాసాలను ప్రదర్శించారు. అంతేకాకుండా 12 వేల మీటర్ల ఎత్తు నుంచి సెయిలింగ్ చేస్తూ, రంగులు వదులుతూ సైనికులు దిగే సన్నివేశాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. సముద్రంలో నడుస్తున్ననౌకల మీద హెలికాప్టర్లు దిగి, మళ్లీ వరుస క్రమంలో వెళ్లడం, శత్రుస్థావరాలపై దాడులు, నీటిలో మునిగిపోయే వారిని నావిదళం ఏలా రక్షిచడం, సైనికులను ఏలా తరలించడం, ఆ తర్వాత వరుస క్రమంలో విమానాలు, హెలికాప్టర్లు, జెట్‌లు వెళ్లడం వంటి విన్యాసాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళాధిపతి, కరణ్‌బీర్ సింగ్‌తో పాటుగా హోంమంత్రి చినరాజప్ప, ఎంపీ హరిబాబు పాల్గొన్నారు.

58 total views, 1 views today