ఏపీలో సిబిఐ విషయం లో హైకోర్ట్ జోక్యం చేసుకోలేదు!!

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐని నిలువరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ గరీబ్‌ రాయుడు అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తునకు, కోర్టులు ఆదేశాలు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం పేర్కొంది. సాధారణ అనుమతి ఉపసంహారించినప్పటికీ కేసును బట్టి దర్యాప్తు చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి తాము జోక్యం చేసుకోమంటూ పిల్‌ను కొట్టివేసింది.

57 total views, 1 views today