మహానటిగా అన‌సూయ … ఆటాడేసుకుంటున్న‌ నెటిజన్లు

‘ఏంది రంగమ్మత్తా ఇదీ.. అసలేమనుకుంటున్నావ్ నువ్.. నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? ఏంటా కుప్పిగంతులు.. సావిత్రి బతికుంటే ఉరేసుకుని చనిపోయేది నిన్ను చూసి.. సావిత్రిలా చేయడం అంటే జబర్దస్త్ షోలో ఆరబోసినంత ఈజీ అనుకున్నావా’ అంటూ సోషల్ మీడియాలో హాట్ యాంకర్ అనసూయకు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్లు.

వీరి ఆగ్రహానికి కారణం ఏంటి? అంటే.. యాంకర్ కమ్ నటిగా ఫుల్ బిజీగా ఉన్న అనసూయ ప్రముఖ వస్త్ర దుకాణసంస్థ చందనబ్రదర్స్‌కి ప్రచారకర్తగా ఉంది. ఇప్పటికే ప్రతి చందనబ్రదర్స్ షాపింగ్ మాల్స్‌లో రంగమ్మత్త భారీ కటౌట్స్‌తో రంగు రంగుల చీరలు కట్టి తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తూ.. కాస్త క్రియేటివిటీని మిక్స్ చేసి ఓ యాడ్‌ని సోషల్ మీడియాలో వదిలారు.

అనసూయతో మాయాబజార్‌లోని సావిత్రి పోషించిన శశిరేఖ వేషం వేయించి ‘అహనా పెళ్ళి అంట ఓహో నా పెళ్లి అంట’ పాట లిరిక్స్‌ను మార్చేసి ‘చందనా సందడంట.. ఆఫర్ల వెల్లువంట’ అంటూ ఫక్తు కమర్షియల్ యాడ్‌ చేశారు. ఇందులో అనుసూయ సావిత్రిని ఇమిటేట్ చేయడం, బట్టలు కొనండి అని కోరడం ప్రేక్షకులకు అసలు రుచించకపోవడంతో ఫైర్ అవుతున్నారు.

సావిత్రి ఎక్కడ? అనసూయ ఎక్కడ? ఆమెను ఈమె ఇమిటేట్ చేయడం ఏంటి? ఏంటా కుప్పిగంతులు.. సావిత్రి బతికుంటే ఉరేసుకుని చనిపోయేది. సావిత్రమ్మను ఇంత అసహ్యంగా యాడ్‌కు వాడుకుంటారా అంటూ చందన బ్రదర్స్ యాజమానాన్నీ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్‌ను అనుకరించిన గాయకుడు మనోకి చివాట్లు పెడుతున్నారు.

పాపం అనసూయ అంత కష్టపడి చేస్తే.. కామెడీ షో బాగుందండీ.. అని సింపుల్‌గా తేల్చిపడేశారు. అవును మరీ జబర్దస్త్ కామెడీ షో అంతలా ఆమె ఫ్యాన్స్‌లో నాటుకుపోయింది. ఇక ‘వావ్.. నేను ఆ సావిత్రి గారిని చూడలేదు. నేను చూసిన సావిత్రి గారు మీరే’ అంటూ ఆమె అభిమాని పాజిటివ్ కామెంట్ పెడితే.. వీడెవడో కరువు బాపతులా ఉన్నాడు’ అంటూ అనసూయ ఫ్యాన్స్‌కి గట్టి పంచ్‌లు వేస్తున్నారు. ఇక అనసూయకు బాగా పైత్యం ముదిరినట్టు ఉంది ఎవరికైనా డాక్టర్‌కి చూపించండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే యాడ్‌ని యాడ్‌లా చూడండి బాస్.. ఆమె బాగానే చేసింది అంటూ శెభాష్ అనసూయ అత్త అంటున్నారు.

101 total views, 1 views today