నిక్ పాట‌… ప్రియాంక ఆట‌

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా రాజస్థాన్‌లోని ఉమైద్‌ భవన్ ప్యాలెస్‌ వేదిక‌గా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 1న క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహం జ‌రిగింది. ఈ రోజు వారిరివురు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్క‌టి కానున్నారు. న‌వంబ‌ర్ 29 నుండి ప్రియాంక పెళ్లికి సంబంధించిన హంగామా మొద‌లు కాగా, రేప‌టితో వేడుక‌లు ముగియ‌నున్నాయి. సంగీత్‌లో ప్రియాంక‌, నిక్‌ల‌తో పాటు కుటుంబ స‌భ్యులు దుమ్మురేపేలా స్టెప్పులేశార‌ట‌. అయితే తాజాగా ప్రియాంక‌, నిక్‌ల సంబంధించి ఓ వీడియోని వోగ్ మ్యాగ‌జైన్ విడుద‌ల చేసింది. ఇందులో నిక్ గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే ప్రియాంక అందుకు త‌గ్గ‌ట్టు స్టెప్పులు వేస్తూ అల‌రించింది. ‘నిక్యాంక’ పెళ్లి స‌మ‌యంలో వోగ్‌ ఈ వీడియోను విడుదల చేయ‌డం విశేషం. ఈ పాటని ప్రముఖ హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సెలియా రోల్సన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. స్టీవెన్ బ్రాహ్మ్స్ డైరెక్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పాట ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.

48 total views, 1 views today