దీప్‌వీర్ రిసెప్షన్‌లో బిగ్ బీ స్టెప్పులు… వీడియో

దీప్‌వీర్ జంట.. ఇంకా సోషల్ మీడియాలో సంద‌డి చేస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత ఇప్పటికే రెండు మూడు విందులు ఏర్పాటు చేసిన ఈ జంట తాజాగా ముంబ‌యిలో అత్యంత స‌న్నిహితుల‌కు మ‌రోసారి విందు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్య‌లోనే హాజ‌ర‌య్యారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, బోనీ కపూర్, హృతిక్ రోషన్, అర్జున్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్, విద్యా బాలన్, కరీనా కపూర్, ఐశ్వర్యారాయ్, జాన్వీ కపూర్, రాణి ముఖర్జీతో పాటు సచిన్ ఫ్యామిలీ, ధోనీ, హార్దిక్ పాండ్య త‌దిత‌రులు హాజరయ్యారు. ఇక.. ఈ రిసెప్షన్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. హమ్ సినిమాలోని జుమ్మా చుమ్మా అనే సాంగ్‌కు డ్యాన్స్ వేసి ఉర్రూతలూగించాడు. తర్వాత చయ్యా చయ్యా అనే సాంగ్‌కు షారుఖ్, రణ్‌వీర్, మలైకా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి.

46 total views, 1 views today