ఈ ఫొటోకు క్యాప్షన్ చెబితే … రెండు కార్లు ఇస్తా: ఆనంద్ మహీంద్రా

ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను పెట్టిన కాంపిటీషన్‌లో గెలుపొందిన వారికి రెండు కొత్త మోడల్ వాహనాలను ఇస్తానని పేర్కొన్నారు. తన ట్విటర్ ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. మొదటి ఫొటోకు మంచి క్యాప్షన్ పెడితే.. విజేతలకు రెండో ఫొటోలో ఉన్న‌ రెండు మోడల్ కార్లు బహుమతిగా ఇస్తానని వెల్లడించారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. ఓ వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన తలపై చిన్న ట్రాలీని పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ ఫొటోకు ఒక అద్భుతమైన శీర్షికను ఆలోచించడంలో విఫలమయ్యాను. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. పోటీకోసం ఈ ఫొటోను మీ ముందుకు తీసుకువచ్చాను. విన్నింగ్ క్యాప్షన్‌కు మహీంద్రా సంస్థ తయారు చేసిన రెండు కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఆనంద్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన ఫాలోవర్లు మెదడుకు పదును పెట్టడం మొదలెట్టారు. ఇక ఆలస్యమెందుకు మీరూ ఆలోచించి మంచి క్యాప్షన్‌ను ఆయనతో పంచుకోండి!

83 total views, 3 views today