మహిళలకు రెండు రోజులు దర్శనానికి కేటాయిస్తాం-కేరళ హైకోర్టు

సుప్రీంకోర్టు తీర్పును శబరిమలలో అమలు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్న ప్రతిసారీ భక్తుల నుంచో లేదా ప్రతిపక్షాల నుంచో వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా మహిళలను రెండు రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తామంటూ శుక్రవారం కేరళ హైకోర్టుకు తెలిపింది.

స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు తమకు రక్షణ కల్పించాలంటూ నలుగురు మహిళలు వేసిన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తికి ఈ సూచన చేశారు. ఇందులో సాధ్యాసాధ్యాలను చర్చించి అనుమతివ్వాలని హైకోర్టును న్యాయవాది కోరారు. ట్రావెన్‌కోర్ బోర్డుతో ఈ అంశం గురించి మాట్లాడి ఏయే తేదీల్లో మహిళలను అనుమతించాలో వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

77 total views, 1 views today