17 నిమిషాల్లో బాబ్రీని పడగొట్టాం..రామ మందిర నిర్మాణానికి ఎంతకాలం?: శివసేన

అయోధ్యలో ఆదివారం విశ్వహిందూ పరిషత్‌ భారీ స్థాయిలో ‘ధర్మ సభ’ నిర్వహించనుంది. మరోవైపు రామ మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశంపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఆర్డినెన్స్‌ తేవడం తొందరపాటు అవుతుందని ఓ ఇంటర్వ్వూలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. తక్షణమే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. లేదా ఎప్పుడు నిర్మిస్తారో నిర్దిష్టమైన తేదీనైనా ప్రకటించాలని పట్టుబడుతోంది.

”మేం 17 నిమిషాల్లో బాబ్రీని పడగొట్టాం. చట్టం తేవడానికి ఎంతకాలం పడుతుంది” అని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. లక్షలాది మంది హిందువులు ఆదివారం అయోధ్య చేరుకుంటారని సాథ్వీ ప్రాచీ చెప్పారు. ధర్మసభ సందర్భంగా అవసరమైతే ‘1992’ పునరావృతమవు తుందని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ (యూపీ) అన్నారు. డిసెంబరు 11 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రామ మందిర నిర్మాణం బిల్లును తప్పనిసరిగా ప్రవేశపెడతామని బీజేపీ ఎంపీ రవీంద్ర కుష్వాహా చెప్పారు. శివసేన వ్యాఖ్యలపై స్పందిస్తూ అయోధ్యలో సైన్యాన్ని మోహరించాలని ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

57 total views, 1 views today