24 కిస్సెస్ రివ్యూ

నటీనటులు : అరుణ్ ఆదిత్ , హెబ్బా పటేల్
సంగీతం : జాయ్ బరువ
నిర్మాత : సంజయ్ రెడ్డి
దర్శకత్వం : అయోధ్య కుమార్

కథ :
చిల్డ్రన్స్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్ ( అరుణ్ ఆదిత్ ) అమ్మాయిల పట్ల వ్యామోహం ఉన్నవాడు , అతడికి శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్ ) పరిచయం అవుతుంది . ఆ పరిచయం కాస్త ముదిరి మరింత ముందుకు వెళ్తారు ఆనంద్ – శ్రీలక్ష్మి లు . అయితే ఆనంద్ తనని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది శ్రీలక్ష్మి కానీ ఆనంద్ యూజ్ అండ్ త్రో అనే విషయం తెలుసుకొని షాక్ అవుతుంది . తనతోనే కాకుండా ఆనంద్ కు ఇంకా చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని తెలుసుకుని ఆనంద్ కు దూరం అవుతుంది . శ్రీలక్ష్మి దూరమయ్యాక ఆనంద్ మారాడా ?తన తప్పు తెలుసుకొని శ్రీలక్ష్మి కి దగ్గరయ్యాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

ఎలా ఉందంటే:
నేటిత‌రం మ‌ధ్య అల్లుకునే బంధాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దాన్ని ద‌ర్శ‌కుడు 24 ముద్దుల‌తో ముడిపెట్టాడు. స్వ‌త‌హాగా చిన్న పిల్లల నేప‌థ్యంలో సాగే ఓ సినిమా తీసిన ఆయ‌న తన ఆలోచ‌న‌ల్ని, స్వీయానుభా‌వాల్ని రంగ‌రించాడు. క‌థ‌లో ఎన్ని విష‌యాలు చెప్పినా సినిమాలో ఏదీ అత‌క్క‌పోగా… ఆద్యంతం గంద‌ర‌గోళంగా సాగుతుంది. ద‌ర్శ‌కుడు అస‌లు ఈ సినిమాతో ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడ‌నే విష‌యం ఒక ప‌ట్టాన ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. ఒక సినిమా చూస్తున్న‌ప్ప‌డు అందులో హాస్య‌మో, భావోద్వేగాలో.. లేదంటే ఆస‌క్తో ఇలా ఏదో ఒక అనుభూతి క‌ల‌గాలి. కానీ ఈ సినిమా చూస్తున్నంత‌సేపు.. ఎంత‌సేపు ఈ సాగ‌దీత అనే అభిప్రాయం క‌లుగుతుంది త‌ప్ప ఏ ద‌శ‌లోనూ ఆక‌ట్టుకోదు. ఆనంద్ త‌న బాధ‌ని సైకో థెర‌పిస్ట్ అయిన మూర్తితో చెప్పుకోవ‌డంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ప్రేమ‌, పెళ్లి అనే పేరు పెట్టాల్సిన అవ‌స‌రమే లేద‌నే ఆలోచ‌న‌లున్న క‌థానాయకుడు… ప్రేమ‌పైనా, పెళ్లిపైనా న‌మ్మ‌క‌మున్న క‌థానాయిక మధ్య సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఇద్ద‌రూ శారీర‌కంగా ఒక్క‌ట‌య్యాక భిన్న అభిప్రాయాలున్న వాళ్లు ఎంత దూరం ప్ర‌యాణం చేశార‌నేది క‌థాంశం. దానికి ద‌ర్శ‌కుడు త‌న‌దైన క‌వితాత్మ‌క‌త‌ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆ క‌థ‌నం ఒక ప‌ట్టాన అర్థం కాదు. చివ‌రికి ప్రేమ‌ని రుచి చూశాన‌న్న క‌థానాయ‌కుడు మ‌ళ్లీ పెళ్లి ద‌గ్గ‌రికొచ్చేస‌రికి న‌మ్మ‌కం లేదంటాడు. దాంతో అక్క‌డ పెళ్లెందుకు ఇష్టం లేద‌ని మ‌రో క‌థ ఉంటుంది. ఆ ప్ర‌హ‌సనం అంతా సాగ‌దీత‌గా అనిపిస్తుంది త‌ప్ప వినోదం కానీ, భావోద్వేగాలు కానీ పంచ‌దు. పేరులోనే ముద్దుల్ని చొప్పించిన ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించొచ్చు కానీ… థియేట‌ర్‌లో మాత్రం మెప్పించ‌లేడు. క‌థ‌, క‌థ‌నాల్లో లోపాల వ‌ల్ల తెర‌పై ముద్దులు కూడా తేలిపోయాయి.

బ‌లాలు:

హెబ్బా పటేల్ గ్లామర్
అరుణ్ ఆదిత్

బ‌ల‌హీన‌త‌లు:

క‌థ‌, క‌థ‌నం
సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు

రివ్యూ : 1.5 / 5

113 total views, 2 views today