సత్యసాయి జయంతి వేడుకల్లో చంద్రబాబు

పుట్టపర్తి శ్రీ సత్యసాయి నిలయంలో సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాయిబాబా సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని బుక్కపట్నంలో గల మారాల జలాశయం వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పైలాన్‌ ఆవిష్కరిస్తారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. కార్తీక వన సమారాధనకు ముఖ్యమంత్రి హాజరై ఒక మొక్క నాటి అక్కడే అటవీశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన తిలకిస్తారు. కార్తీక వన భోజనాల్లోనూ పాల్గొంటారు.

46 total views, 1 views today