అన్నవరంలో స్వామి సన్నిధికి పెద్దఎత్తున భక్తులు

అన్నవరంలోగల సత్యనారాయణ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రత్నగిరిపై భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. కాగా… భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల నుంచే స్వామివారి సర్వదర్శనాన్ని ప్రారంభించారు.

28 total views, 1 views today