శబరిమలలో కేంద్ర మంత్రిని అడ్డుకున్న పోలీసులు

కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌కు శబరిమలలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం తెల్లవారుజామున అయ్యప్ప దర్శనం ముగించుకుని ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కన్యాకుమారి ఎంపీ అయిన ఆయన ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని చివరి వాహనంలో ఆందోళనకారులు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపేశారు. ఈ ఘటనతో దాదాపు అరగంట పాటు మంత్రి ప్రయాణం ఆలస్యమైంది. తర్వాత మంత్రి కాన్వాయ్‌లోని వాహనం అని తెలుసుకున్న పోలీసులు దాన్ని వదిలేశారు. ఎస్పీ హరిశంకర్‌ రాతపూర్వకంగా మంత్రి రాధాకృష్ణన్‌కు క్షమాపణలు చెప్పారు. అయితే పోలీసుల తీరు కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసన తెలియజేసేందుకు మంత్రి వాహనాన్ని వదిలి ప్రజా రవాణా బస్సులో పంబా వరకు వెళ్లారు.

పోలీసుల చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. నీలక్కల్‌ నుంచి పంబాకు ఎందుకు ప్రైవేటు వాహనాలు అనుమతించడం లేదని మంత్రి ప్రశ్నించారు. బుధవారం ఆలయానికి వెళ్లే సమయంలోనూ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. కేరళ ప్రభుత్వం భక్తులను వేధిస్తోందని ఆరోపించారు.

41 total views, 1 views today