20న సముద్రుడికి ‘విష్ణు హారతి’

అమ్మ కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్‌ ట్రస్ట్‌ శ్రీవారి సేవ ఆధ్వర్యంలో ఈ నెల 20న 4.30 గంటలకు విశాఖ ఆర్‌కే బీచ్‌లో సముద్రుడికి ‘విష్ణు హారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్టు చైర్మన్‌ కె.వి.వి.రావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సముద్ర తీరాలకు ఏడేళ్లుగా ట్రస్టు ఆధ్వర్యంలో హారతులిచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్‌కే బీచ్‌ అన్నమయ్య విగ్రహం ఎదురుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

46 total views, 1 views today