న్యూజెర్సీలో కాల్పులు… తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి

తెలంగాణలోని మెదక్ పట్టణానికి చెందిన 61 ఏళ్ళ సునీల్ ఎడ్ల అమెరికాలో హత్యకు గురయ్యారు. న్యూజెర్సీలోని మేస్ లాండింగ్ ప్రాంతంలో ఒక పదహారేళ్ల కుర్రాడు ఆయన మీద కాల్పులు జరిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. కాల్పులు జరిపిన టీనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి కనిపించకుండా పోయిన సునీల్ కారును పోలీసులు అట్లాంటిక్ సిటీ నిఘా కేంద్రం సహాయంతో స్వాధీనం చేసుకున్నారు. అట్లాంటా కౌంటీ ప్రాసిక్యూటర్ డామన్ జి టైనర్ చెప్పిన వివరాల ప్రకారం, న్యూజెర్సీలోని నాష్విల్ అవెన్యూలో నివాసం ఉంటున్న సునీల్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 15న రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు.

66 total views, 1 views today