నాకు పిల్లలు లేరు… మీరే నా పిల్ల‌లు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో శనివారం (నవంబర్ 17) ఆయన నామినేషన్‌ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. పీపుల్స్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా తాను నామినేషన్‌ వేశానని తెలిపారు.

తనకు పిల్లలు లేరని, హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని ఉత్తమ్ అన్నారు. ‘నాకు పిల్లలు లేరు.. ఈ ప్రాంత ప్రజలనే నా పిల్లలుగా భావించి పనిచేశా’ అని ఉత్తమ్‌ పేర్కొ్న్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పాలన, కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు.

హుజూర్‌నగర్‌లోని గణేశ్‌ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించిన అనంతరం ఉత్తమ్.. భారీ ర్యాలీతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

59 total views, 2 views today