‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్

దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్

నిర్మాత : ఎస్ కె ఎన్

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్

ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్

కథ :

శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ ఐదు సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసుకోని, జాబ్ కోసం హైదరాబాద్ కు వస్తాడు. అలా రకరకాల జాబ్ లు చేసి.. ఏ జాబ్ నచ్చక, ఫైనల్ గా ఓ కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతాడు. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో కార్ వల్ల జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా శివ లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి.

దాంతో ఆ కార్ ని వదిలించుకోవడానికి శివ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆ కార్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అంతలో ఆ కారు లో ప్రయాణించిన ఓ డాక్టర్ ను, ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు ఆ కార్ అతన్ని ఎందుకు చంపుతుంది ? ఆ కార్ లో ఏముంది ? ఎవరు కోసం ఎదురుచుస్తూ ఉంది? శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? దానికి శివ ఏ విధంగా సహాయపడతాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 

తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మున్న క‌థే ఇది. ఈమ‌ధ్య త‌క్కువ‌య్యాయి కానీ… ఇదివ‌ర‌కు ఇంట్లో దెయ్యం, బంగ‌ళాలో దెయ్యం అంటూ వాటి చుట్టూ న‌డిచే క‌థ‌లు త‌ర‌చుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేవి. ఇలాంటి కాన్సెప్ట్‌లు తెలుగులో మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఇక్క‌డ ప్ర‌త్యేక‌త ఏంటంటే దెయ్యం టాక్సీలో ఉండ‌టం. దాని చుట్టూ కొత్త‌గా హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశారు. ఆస్ట్ర‌ల్ ప్రొజెక్ష‌న్ అంటూ ఆత్మ‌ని శ‌రీరంతో వేరు చేయొచ్చనే విష‌యాన్ని జోడించి ఈ చిత్రానికి సైన్స్ ఫిక్ష‌న్ ట‌చ్ ఇచ్చిన విధానం కూడా బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు క‌థ‌ని న‌డిపిన విధానం బాగుంది. హాస్యం కోసమ‌ని, హీరోయిజం కోస‌మ‌ని క‌థ‌ని విడిచి ఎక్క‌డా సాము చేయ‌లేదు. తొలి స‌గ‌భాగం క‌థంతా కూడా హాస్యంతో సాగుతుంది. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్న‌ట్టు అనిపించినా… క్ర‌మం త‌ప్ప‌కుండా హాస్యం పండించ‌డం మాత్రం మ‌రిచిపోలేదు. దాంతో స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. కారులో ఉన్న దెయ్యం ఎప్పుడైతే విజృంభించ‌డం మొద‌లుపెడుతుందో అప్ప‌ట్నుంచి క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ద్వితీయార్ధంలో కారులో దెయ్యం ఎందుకుంద‌నే విష‌యాలతో పాటు.. శిశిర‌గా మాళ‌విక నాయ‌ర్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌ధునంద‌న్‌తోపాటు, హాలీవుడ్ పాత్ర క‌లిసి చేసే సంద‌డి న‌వ్విస్తుంది. ద్వితీయార్థంలో కారు య‌జ‌మాని ఇంట్లోనూ, మార్చురీ గది నేప‌థ్యంలోనూ వాళ్లు చేసే హంగామా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. క‌థానాయ‌కుడు, ఆయ‌న కుటుంబం నేప‌థ్యంలో వ‌చ్చే ప‌తాక స‌న్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.

బ‌లాలు :

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న

హాస్యం

కాన్సెప్ట్‌

బ‌ల‌హీన‌త‌లు :

ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు

రేటింగ్ : 3 / 5

221 total views, 1 views today