ఆసక్తికరంగా ‘డంబో’ ట్రైలర్‌

ఎగిరే ఏనుగు పిల్ల నేపథ్యంలో లైవ్‌ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించింది డిస్నీ సంస్థ. ఈ సినిమా టైటిల్‌ ‘డంబో’. టిమ్‌ బర్టన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో డంబో అనే ఓ ఏనుగు పిల్ల చేత సర్కస్‌లో విన్యాసాలు చేయించడం చూపించారు. వచ్చే ఏడాది మార్చ్‌ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. వాండెవేర్‌ అనే వ్యక్తి ఓ సర్కస్‌కు యజమానిగా వ్యవహరిస్తుంటాడు. ఈ సర్కస్‌లో డంబో చేత విన్యాసాలు చేయించాలనుకుంటారు. కానీ సర్కస్‌ కోసమని డంబో తల్లిని వేరే ప్రాంతానికి పంపించేస్తారు. ఆ సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. డంబోను తల్లి నుంచి వేరుచేసే సన్నివేశాలు కంటతడిపెట్టించేలా ఉన్నాయి. తన తల్లి కోసం డంబో పడే ఆరాటం వర్ణనాతీతం. ఎలాగైనా డంబోను తన తల్లి వద్దకు చేర్చాలని వాండెవేర్‌ పిల్లలు కూడా ప్రయత్నిస్తుంటారు. మరి డంబో మొత్తానికి తన తల్లి వద్దకు చేరుకుందా? ఇంతకీ డంబోకు ఎగిరే శక్తి ఎలా వచ్చింది? అన్నదే సినిమా.

23 total views, 1 views today