డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పోస్టుల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. దీని ప్రకారం దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఇది వరకు నవంబరు 15 కాగా.. తాజా పొడిగింపుతో న‌వంబ‌రు 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. అదే విధంగా దరఖాస్తుల సమర్పణకు ఉన్న గడువును నవంబరు 16 నుంచి నవంబరు 18కి పొడిగించారు.

డీఎస్సీ దరఖాస్తు ఫీజు చెల్లించిన అభ్యర్థుల సంఖ్య మంగళవారం (న‌వంబ‌రు 13) రాత్రి వ‌ర‌కు 4.46 లక్షలకు చేరింది. 4 లక్షల వరకే దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేసినప్పటికీ ఆ సంఖ్య ఇప్పటికే దాటిపోయింది. దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలకు చేరినా ఆశ్యర్చపోనవసరంలేదు.

ఇదిలా ఉండగా.. వ్యాయామ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అంశం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున ఈ పోస్టులకు అభ్యర్థులందరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారుల ప్రకటించారు.

61 total views, 1 views today