నామినేషన్ దాఖలు చేసిన హరీశ్ రావు

సిద్దిపేట: సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. తొలుత హరీశ్ రావు ఇంటి నుంచి బయలుదేరి ఈద్గా చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. హరీశ్ రావు వెంట పలువురు టీఆర్ఎస్ నేతలున్నారు. మరోవైపు హుస్నాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్ నామినేషన్ దాఖలు చేశారు.

49 total views, 1 views today