పింక్‌ ‘డైమండ్‌’ అరుదైన ఘనత.. వేలంలో రికార్టు ధర

అత్యంత అరుదైన 19 క్యారెట్ల పింక్ డైమండ్ వేలంలో 5 కోట్ల డాలర్ల (సుమారు రూ.360 కోట్లు)కు అమ్ముడుపోయింది. జెనీవాలో క్రిస్టీస్ ఈ వేలం వేసింది. ఒక్కో క్యారట్ పరంగా చూస్తే ఈ ధర కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఓవరాల్ ధరను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో క్యారెట్ రూ.18 కోట్ల 75 లక్షలు పలకడం విశేషం. పింక్ డైమండ్‌కు ఇది ప్రపంచ రికార్డు అని క్రిస్టీస్ యూరప్ హెడ్ ఫ్రాంకోయిస్ కురియెల్ చెప్పారు. డైమండ్స్‌లో ఇది లియొనార్డో డా విన్సీ అని ఆయన తెలిపారు. ఓపెన్‌హీమర్ కుటుంబానికి చెందిన ద పింక్ లెగసీ కొన్ని దశాబ్దాల పాటు డీ బీర్స్ డైమండ్ మైనింగ్ కంపెనీ దగ్గర ఉంది. ఇప్పుడు వేలంలో దీనిని అమెరికా లగ్జరీ బ్రాండ్ హ్యారీ విన్‌స్టన్ సొంతం చేసుకుంది. వెంటనే దీని పేరును విన్‌స్టన్ పింక్ లెగసీగా మార్చారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన డైమండ్లలో ఈ పింగ్ లెగసీ కూడా ఒకటని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెలరీ రాహుల్ కడాకియా చెప్పారు. ఈ డైమండ్‌ను వందేళ్ల కిందట సౌతాఫ్రికా గనుల్లో గుర్తించారు. 1920లో దీనిని సానబెట్టగా..

43 total views, 2 views today