చంద్రబాబు కలవడం ఆహ్వానించే పరిణామం: స్టాలిన్‌

డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చంద్రబాబు చర్చించారు. సమావేశంలో డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్‌ బాలు పాల్గొన్నారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్‌ కాలరాస్తోందని ఆరోపించారు. మతవాద బీజేపీతో గద్దె దించేందుకే చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే రాహుల్‌ను చంద్రబాబు కలిశారని తెలిపారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం.. ఆహ్వానించే పరిణామని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని, ఢిల్లీ లేదా మరో నగరంలో అందరం కలుస్తామని స్టాలిన్‌ తెలిపారు

32 total views, 1 views today