కూటమి పక్షాలన్నీ ఒకే తాటిపై ఉంటాయి-ఎల్. రమణ

మహాకూటమిలో చిన్న చిన్న సమ్యలు వచ్చినా.. ఏది జరిగినా.. టీ కప్పులో తుపాన్ లాంటిదేనని, కూటమి పక్షాలన్నీ ఒకే తాటిపై ఉంటాయని టీటీడీపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో చిన్న చిన్న అభిప్రాయాలు వస్తాయని, వాటిపై నేతలు మాట్లాడతారని, అంత మాత్రాన సమస్యలు రావన్నారు. కూటమితో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని వెళతామని ముందే అనుకున్నామని, గౌరవప్రదమైన వాతావరణం ఉండాలని, పట్టు విడుపులు ఉండాలని మాట్లాడుకున్నామని రమణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కూటమి కృషి చేస్తుందని.. సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చామని ఆయన స్పష్టం చేశారు.

28 total views, 1 views today