రామ్ చరణ్ మంచి నటుడే కాదు-జగపతిబాబు

హీరో రామ్ చరణ్.. తనకు తెలిసి మంచి నటుడే కాదని, మంచి మనసున్న నిర్మాత కూడా అని సీనియర్ నటుడు జగపతిబాబు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ జార్జియాలో జరిగింది. కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో వందలామంది ఆర్టిస్టులతో పాటు జగపతిబాబు పాల్గొన్నారు. ఈ సమయంలో హీరో రామ్‌చరణ్ వాళ్లతో కలిసి మెలిసి ఉండటాన్ని జగపతిబాబు గుర్తుచేశారు. ఆర్టిస్టులందరినీ చిన్నాపెద్దా తేడా లేకుండా రామ్ చరణ్ చాలా బాగా చూసుకున్నారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భోజన వసతి కల్పించారని, ఆర్టిస్టుల మధ్య సమస్యలు వస్తే చాలా చక్కగా పరిష్కరించారని జగపతిబాబు చెప్పారు.

104 total views, 1 views today