రోడ్డెక్కి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు

పెడన నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. జోగి రమేష్ వర్గం, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 2014 ఎన్నికలు అయిన దగ్గర నుంచి పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్‌గా ఉప్పాల రాంప్రసాద్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జోగి రమేష్ అనే వ్యక్తిని పెడన నియోజకవర్గానికి జగన్ పంపించారు. దీంతో ఇద్దరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఇరువురూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మచిలీపట్నం ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బలసౌరీ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బాలసౌరీకి సంబంధించిన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ పోటా పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. గొడవకు కారణమైనవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

33 total views, 1 views today