దేశం కోసమే చంద్రబాబు మాతో కలిశారు-జానారెడ్డి

కాంగ్రెస్‌తో చంద్రబాబు కలయికపై వస్తోన్న విమర్శలకు జానారెడ్డి వివరణ ఇచ్చారు. దేశ అవసరాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు తమతో కలిసి వస్తున్నారని తెలిపారు. చంద్రబాబుతో కేసీఆర్‌కు అవసరం ఉండి ఆనాడు కలిశారని, మరోసారి కాంగ్రెస్‌తో అవసరం ఉండి పొత్తు పెట్టుకున్నారు తప్ప తామెవరినీ కలవలేదన్నారు. దేశ అవసరాలను బట్టే పరస్పరం పొత్తులు పెట్టుకొనేందుకు ముందుకొచ్చినట్టు చెప్పారు. చంద్రబాబు రాహుల్‌ ఇంటికి వెళ్లినప్పడు తాము దిల్లీలో చంద్రబాబు ఉండే ప్రాంతానికి వెళ్లి కలిస్తే తప్పంటేన్నారు. ఆయన దిల్లీలో అందుబాటులో ఉన్నారు కాబట్టే చంద్రబాబును కలిశామని, ఆయన కోసం తామేమీ నిరీక్షించలేదని స్పష్టంచేశారు.

32 total views, 1 views today