ఆ డైరెక్టర్ నన్ను అన్నీ రకాలుగా చూడాలని ఉందన్నాడు- కుండ బద్దలు కొట్టిన రాధిక ఆప్టే

రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెబుతుంది. తనను ఆడిషన్‌కు పిలిచి దారుణంగా ట్రీట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ప్రసారమైన నటి నేహా దూపియా షోకు హాజరైన రాధిక ఆప్టే తాను అనుభవించిన కష్టాలను వెల్లడించింది.”లండన్‌లో ఓ సినిమా షూటింగ్ నుంచి అప్పుడే ముంబైకి వచ్చాను. ఓ డైరెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్‌గా ఆడిషన్‌కు రమ్మన్నాడు. మీకు హోటల్ రూం బుక్ చేస్తాం. ఆ డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు. ఓ నాసిరకం హోటెల్‌కు తీసుకెళ్లారు. విషయానికి వస్తే అసలేం జరిగిందో నేను చెప్పాల్సిందే…ఆడిషన్‌కు అని పిలిచి ఏదో ఏదో చేశారు. నా జాకెట్ కొలుతలు తీసుకోవడానికి టైలర్‌తోపాటు 12 మంది వచ్చారు. వారు వచ్చి చిన్న జాకెట్‌లాంటిది ఇచ్చి వేసుకోమన్నారు. దానిని ధరించగానే ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి అని రాధిక చెప్పారు. వాస్తవానికి ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంగా రూపొందాల్సింది. ఆ భారీ బడ్జెట్ సినిమాలో విక్రమ్ హీరో. ఆడిషన్‌లో భాగంగా ఆ డైరెక్టర్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. నిన్ను అన్ని కోణాల్లో, అన్నీ రకాలుగా పరీక్షించాలి అంటూ అదోలా నవ్వాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చిన ఓపిక పట్టాను అని రాధిక చెప్పారు.నేను ఈ హోటల్‌లో ఉండలేను. ఈ రాత్రికి తిరిగి వెళ్లిపోవాలని ఆ రోజే డైరెక్టర్‌కు చెప్పాను. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చేశాను. అప్పుడే మారోసారి దక్షిణాది గడప తొక్కద్దని అనుకొన్నాను”అని రాధిక ఆప్టే తనకు జరిగిన అనుభవాన్ని పూసగుచ్చినట్టు నేహా దూపియాకు చెప్పుకొన్నారు.

103 total views, 2 views today