11న ఏపీ కేబినెట్‌ విస్తరణ

ఏపీ కేబినెట్ విస్తరణకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణ చేపడతారని సమాచారం. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను సీఎం భర్తీ చేస్తారు. ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌కు ఎస్టీ కోటా నుంచి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. అదే రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మైనార్టీల నుంచి మండలి చైర్మన్‌ షరీఫ్‌, ఫరూక్‌లకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని సమాచారం.

36 total views, 2 views today