హరీశ్‌రావు,రేవంత్‌ రెడ్డి,వంటేరు,రేవూరి కి ఈసీ నోటీసులు

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, వంటేరు ప్రతాప్‌ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

21 total views, 1 views today