‘నెక్స్ట్ ఏంటి’ ఫస్టులుక్ రిలీజ్

తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తున్న తమన్నాకు తెలుగు లో అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన బాహబలి పార్ట్ 1 లో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించినా..బాహుబలి 2 లో మాత్రం పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్ లో ‘హమ్ తుమ్’.. ‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

తమన్నా, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా మీడియాలో మాత్రం పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇదిలా ఉంటే..టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం మొదటి సారి. నవదీప్, పూనమ్ కౌర్‌, శరత్ బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ‘నెక్స్ట్ ఏంటి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

36 total views, 1 views today